పెరూ దేశంలోనూ యూపీఐ సేవలు

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) తరహా రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను లాటిన్ అమెరికా దేశమైన పెరూలో తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌పీఐఎల్) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూపీఐ సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరూ నిలుస్తుందని ఎన్‌ఐపీఎల్ తెలిపింది. ఆ దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందని ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేశ్ శుక్లా వెల్లడిరచారు. ఎన్‌ఐపీఎల్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.