హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ కు విమాన సేవలు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా బ్యాంకాక్‌కు మరో విమానయాన సంస్థ సేవలు ప్రారంభించింది. దేశీయ విపణిలోకి ప్రవేశించిన థాయ్‌లాండ్ చౌకధరల విమానయాన సంస్థ నోక్ ఎయిర్, హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సర్వీసును ప్రారంభించింది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంతో ఈ సేవలు నిర్వహిస్తోంది. శంషాబాద్ నుంచి ఇప్పటికే థాయ్ ఎయిర్వేస్ సంస్థ బ్యాంకాక్‌కు నేరుగా విమానాలు నడుపుతుండగా, నోక్ ఎయిర్ రెండోదని విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు.






