Nissan: నిస్సాన్‌లో 20వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన?

ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. కార్ల (Cars) అమ్మకాలు క్షీణించడం, నష్టాలు పెరగడంతో కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు 20 వేలమంది (15శాతం)కి ఉద్వాసన పలకాలని యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో అమెరికా (America) , చైనా (China) ల్లో పేలవమైన విక్రయాల కారణంగా లాభాల్లో 94శాతం క్షీతణ నమోదు కావడంతో 9వేల మంది ఉద్యోగులను (Employees) తొలగిస్తున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఏకంగా రెట్టింపు ఉద్యోగాలకు కోత విధిస్తుందడం గమనార్హం.