పేటీఎంకు మరో ఎదురుదెబ్బ!

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం బ్యాంక్‌ను తొలగించింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్‌సీఎల్ ఈ నిర్ణయం తీసుకున్నది. తాము ప్రకటించిన 32 బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు తీసుకోవాలని సూచించింది. ఈ 32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులున్నాయి.