దుబాయ్ చరిత్రలో భారీ ప్రాపర్టీ డీల్ … ఆ భవనం విలువ
భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దుబాయ్లో మరొక విలాసవంతైమన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు 163 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1353 కోట్లు) అని, దుబాయ్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రాపర్టీ డీల్ అని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిర్దిష్టంగా ముకేశ్ అంబానీ ఈ విల్లాను కొన్నట్లు అధికారిక ప్రకటన రాలేదు. 163 మిలియన్ డాలర్ల ప్రాపర్టీ డీల్ గురించి దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ గతవారం పేర్కొన్నట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. పామ్ జుమైరా ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రాపర్టీ డీల్ ఎవరి పేరుతో జరిగిందన్న విషయం మాత్రం బహిర్గతం కాలేదు.కువైట్కు చెందిన సంపన్నడు మహ్మద్ అల్షాయా నుంచి అంబానీ దీన్ని కొన్నట్లు సమాచారం.






