మెట్రో కోసం… ముకేశ్, బెజోస్ మధ్య పోటీ
జర్మనీ రిటైల్ సంస్థ మెట్రో ఏజీకి చెందిన భారత టోకు వ్యాపార కార్యకలాపాల కొనుగోలు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌తో పాటు థాయ్‌లాండ్‌కు చెందిన చారోన్ పోక్పాండ్ గ్రూప్ అధిపతి ధానిన్ చేరావనోంత్ పోటీ పడుతున్నట్లు సమాచారం. భారత్ వంటి అతిపెద్ద విపణిలో తమ రిటైల్ మూలాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ, ధానిన్ చేరావనోంత్ ఇప్పటికే మెట్రో కోసం నాన్ బైండింగ్ బిడ్లు దాఖలు చేశారని తెలిసింది. జెఫ్ బెజోస్ సైతం బిడ్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ భారత వ్యాపార విలువ 1-1.2 బి.డాలర్ల (సుమారు రూ.7960-9550 కోట్లు) మేర ఉండొచ్చని సమాచారం. తదుపరి బిల్డింగ్‌కు ఎవరిని ఎంపిక చేశారన్నది ఆగస్గులో వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై మెట్రో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.






