Mukesh Ambani :రిలయన్స్ .. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్(Data Center )ను భారత్‌లో నిర్మించాలని చూస్తున్నారు. గుజరాత్ (Gujarat)లోని జామ్‌నగర్‌లో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఎన్విడియా నుంచి అధునాతన ఏఐ చిప్ (AI chip )లను కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఏఐ సేవల కోసం డేటా సెంటర్ సామర్థ్యాలను విస్తరించాలని చూస్తున్నాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అంబానీ చూస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీని నిర్మాణ పనులు అనుకొన్నట్లే ముందుకు సాగితే ప్రస్తుతం ఈ విభాగంలో భారత్ సామర్థ్యాలు పెరుగుతాయి. దేశంలో మొత్తం సామర్థ్యం గిగావాట్ కంటే తక్కువే ఉంది. కొత్త ప్రాజెక్ట్‌తో ఇది మూడిరతలు పెరగవచ్చు. ఇది దేశానికి మైలురాయిగా మారుతుంది.