మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం…. వారికి షాకింగ్ న్యూస్

మీరు విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్. ఇకపై మీ ల్యాప్‌టాప్ కంప్యూటర్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి సెక్యూరిటీ సర్వీస్ సేవలు లభించవు. 2025 అక్టోబరు 14వ తేదీ నుంచి విండోస్ 10 ఓఎస్‌కు సర్వీస్ సపోర్టు నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 24 కోట్ల కంప్యూటర్లు పనికిరాకుండా పోతాయని కెనాలిస్ రీసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది.