మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా గేమింగ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలుకి తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 69 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5.15 లక్షల కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలు ద్వారా మొబైల్, పీసీ, కన్సోల్, క్లౌడ్ విభాగాల్లో గేమింగ్ బిజినెస్‌ను మరింత విస్తరించుకునే వీలుంది. డీల్‌ను క్యాండి క్రష్, వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్ తదితర పలు సుప్రసిద్ధ గేములను రూపొందించిన కంపెనీ కొనుగోలులో భాగంగా షేరుకి 95 డాలర్ల చొప్పున ధరను చెల్లించనుంది. వారాంతాన ముగింపు ధరతో పోలిస్తే ఇది 45 శాతం ప్రీమియం. డీల్ పూర్తయ్యేవరకూ యాక్టివిజన్ ప్రస్తుత సీఈవో బాబీ కొటిక్ ఆ పదవిలో కొనసాగనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తదుపరి మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఫిల్ స్పెన్సర్ అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది.






