మైక్రోసాఫ్ట్‌లోకి త్వరలో ఎఐ వర్కర్లు

గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ త్వరలో ఎఐ వర్కర్లను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వచ్చే నెల నుండి ఎఐ ఏజెంట్లు, వర్చువల్ వర్కర్లను నియమించుకోనున్నట్లు తెలిసింది. సంస్థ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి ఎఐ సహాయక వర్చువల్ కార్మికులను తీసుకోనున్నారు. వీరికి మొదటి దశలో కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడం, సేల్స్ లీడ్ ఐడెంటిఫికేషన్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్వీస్ వంటి టాస్క్‌లు ఇవ్వనున్నారు. మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన కో పైలట్ స్టూడియోతో, కంపెనీలు తమ స్వంత ఎఐ ఏజెంట్లను నియమించుకోవచ్చు.