భారీగా పెరిగిన సత్య నాదెళ్ల వేతనం …ఇప్పుడు ఎంతంటే ?

అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ అయిన తెలుగు తేజం సత్య నాదెళ్ల 2024 జూన్ 30 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 7.91 కోట్ల డాలర్ల (రూ.665.15 కోట్లు) భారీ పారితోషికాన్ని అందుకున్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని వెల్లడిరచింది. నాదెళ్ల వార్షిక ప్యాకేజీ 2023 ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 63 శాతం పెరిగింది. అంతేకాదు 2014లో మైక్రోసాఫ్ట్ సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కాలంలో నాదెళ్ల అందుకున్న అత్యధిక పారితోషికమిదే. 2014 ఆర్థిక సంవత్సరంలో ఆయనకు 8.4 కోట్ల డాలర్ల ప్యాకేజీ లభించింది.