మైక్రోసాఫ్ట్ మరో అరుదైన ఘనత.. ప్రపంచంలోనే

సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు (రూ.249.40 లక్షల కోట్లు ) దాటింది. ట్రేడ్‌లో షేర్లు 1.7 శాతం పెరిగి 405.63 డాలర్లు ( రూ.33,675)కి చేరాయి. దీంతో ఈ కంపనీ మైలురాయి చేరుకుంది. అయితే దీని తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్లు కొద్దిగా తగ్గి 402.56 డాలర్లు (రూ.33,472) స్థాయిలో ముగిశాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 2.99 ట్రిటియన్ డాలర్లకు పడిపోయింది. మార్కెట్ విలువ ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలలో రెండో స్థానంలో ఉంది. వాల్యుయేషన్ ప్రకారం, ఈ జాబితాలో యాపిల్ నంబర్ వన్ స్థానంలో ఉంది. మూడో స్థానంలో చమురు, గ్యాస్ కంపెనీ సౌదీ అరామ్‌కో ఉంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్భాబెట్ ఐదో స్థానంలో ఇకామర్స్ వ్యాపార ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఉన్నాయి.