యాపిల్ కు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను అధిగమించి మైక్రోసాఫ్ట్ సరికొత్త ఘనత సాధించింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాప్ట్ కంటే 0.9 శాతం కిందకు దిగజారింది. ఈ నెలలో యాపిల్ షేరు విలువ 3.3 శాతం తగ్గితే, మైక్రోసాఫ్ట్ స్క్రిప్ 1.8 శాతం రాణించడం ఇందుకు ఉపకరించింది. ప్రస్తుతం 2.871 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.238.29 లక్షల కోట్లు) మార్కెట్ విలువతో యాపిల్ రెండో స్థానానికి పరిమితమవ్వగా, 2.875 ట్రి. డాలర్ల (సుమారు రూ.238.62 లక్షల కోట్లు) మార్కెట్ విలువతో మైక్రోసాఫ్ట్ అగ్ర స్థానానికి ఎగబాకింది.