భారీగా నష్టపోయిన ఫేస్బుక్ .. ఒక్కరోజులోనే
ఫేస్బుక్ యజమాన్య సంస్థ మెటా స్టాక్స్ ట్రేడింగ్లో భారీ నష్టాలను చవి చూశాయి. ఒక్క రోజే కంపెనీ విలువ రూ.14,94,040 కోట్లు ఆవిరైంది. ఈ షేరు పతనం స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఘోరమైన ఒక రోజు క్రాష్గా పేర్కొంటున్నారు. పేలవమైన ఫలితాల కారణంగా అమెరికా ట్రేడింగ్లో ఫేస్బుఖ్ షేర్లు 24 శాతం క్రాష్ అయ్యాయి. దీని వలన కంపెనీ విలువ 200 బిలియన్ డాలర్లకు పైగా తుడిచి పెట్టుకుపోయింది. అంటే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్సల్టెన్సీ (టిసిఎస్) విలువ 170 బిలయన్ డాలర్లకు దగ్గరగా ఈ నష్టం ఉందన్న మాట. ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ కారణంగా ఫేస్బుక్ పై ప్రభావం ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.






