Meta: పెట్టుబడి మోసాలకు చెక్.. 23 వేల ఫేస్‌బుక్ పేజీలను తొలగించిన మెటా

ఫేస్‌బుక్ వేదికగా పెట్టుబడి మోసాలకు మాతృసంస్థ మెటా (Meta) చెక్ పెట్టింది. భారత్ ( India), బ్రెజిల్ (Brazil) వంటి దేశాల ప్రజలకు వల చేస్తూ మోసగాళ్లు రూపొందించిన 23 వేల పేజీలను మార్చి నెలలో ఫేస్‌బుక్ (Facebook) నుంచి తొలగించింది. ఈ స్కామర్లు డీప్‌ఫేక్, ఇతర ఆధునిక టెక్నికల్‌ను ఉపయోగించి పర్సనల్ ఫైనాన్స్ క్రియేటర్లు, క్రికెట్ ఆటగాళ్లు, వ్యాపార ప్రముఖల పేరిట మోసపూరితమైన ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిసార్తు. అలా ప్రజలు వలలో పడి వారు చెప్పిన స్కామ్ గ్యాంబ్లింగ్ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store) నుంచి డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తారు అని మెటా తెలిపింది. ఆ రరంగా మనుగడలో లేని నకిలీ కంపెనీల్లో పెట్టుబడుల పట్టేలా ప్రేరేపిస్తారని పేర్కొంది.