సామర్థ్యం ఉంటేనే సరి.. లేదంటే వెళ్లిపోండి
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఈసీవో మార్గ్ జుకర్బర్గ్ మేనేజర్ స్థాయి ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్న సంకేతాలిచ్చారు. మెటా సంస్థలో గతేడాది భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించారు. తాజాగా కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు మార్క్ జుకర్బర్గ్ ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని లేఆఫ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. గతవరం కంపెనీలో జరిగిన సమావేశం సందర్భంగా కేవలం సిబ్బందితో పని చేయించడమే కాకుండా పనిలో వ్యక్తిగత పాత్ర ఉండాల్సిందే అని మేనేజర్లు, డైరెక్టర్ స్థాయి ఉద్యోగులను జుకర్ బర్గ్ హెచ్చరించారు. ఈ ఏడాది మరింత ఏఫీషియెన్సీ కనబరచాల్సిందే అని తేల్చి చెప్పారు. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో కంపెనీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.






