జుకర్ బర్గ్ కు బిగ్ షాక్.. 11.9 కోట్ల మంది
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ఖాతాను దాదాపు 12 కోట్ల మంది ఫాలో అయ్యేవారు. ఏం జరిగిందో తెలియదు రాత్రికి రాత్రే 11.9 కోట్ల మంది ఆయనను అన్‌ఫాలో చేశారు. ప్రస్తుతం ఆయన ఫాలోవర్లు 10 వేల లోపే. ఇది ఒక్క జుకర్‌బర్గ్ సమస్యే కాదు. ఫేస్బుక్ ఖాతాలున్న చాలా మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫేస్బుక్ ఓ సునామీని సృష్టించింది. అందులో నా 9 లక్షల మంది ఫాలోవర్లను కొట్టుకుపోయారు. ఇప్పుడు నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9 వేల మంది మాత్రమే. ఈ కామెడీ నాకు నచ్చింది అని రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. ఈ సమస్యపై మెటాను సంప్రదించగా తమకు కూడా కారణం తెలియదని, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.






