అభిమానికి లులూ చైర్మన్ అపూర్వకానుక!

ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ ఉన్న లులూ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎం.ఎ.యూసప్ అలి తన అభిమానికి అపూర్వమైన కానుక ఇచ్చారు. యూట్యూబర్ ఎఫిన్ దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటైన లులూ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. యూట్యూబర్‌తో యూసఫ్ అలి సరదాగా మాట్లాడుతూ రూ.2 లక్షల ఖరీదైన చేతి గడియారం బహుమతిగా ఇచ్చారు. ఎఫిన్ గతంలోనూ యూసఫ్ అలిని కలిశాడు. ఓ కార్యక్రమంలో భాగంగా ఈ బిలియనీర్ తన తల్లి గురించి మాట్లాడిన మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెబుతూ అలి తల్లి ఫోటోతో ఉన్న వాటర్‌ఫ్రూఫ్ వాచ్‌ను లులూ చైర్మన్‌కు ఎఫిన్ బహూకరించారు. దీనికి ఎంతో సంతోషించిన యూసఫ్ అలి అమ్మను ప్రేమించనివారు ఎవరుంటారని భావోద్వేగానికి గురయ్యారు. 2001లో యూసఫ్ అలి కుటుంబంతో దుబాయ్ నుంచి అబుధాబికి కారులో వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.