India: భారత్-అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం

భారత్-అమెరికా (India-America) మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం జూన్ 25 కల్లా కుదిరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాణిజ్య చర్చల నిమిత్తం అమెరికా అధికారుల బృందం వచ్చే నెలలో మన దేశానికి రానుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చర్చలు ముందుకెళుతున్నాయి. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని వివరించారు. భారత ముఖ్య సంధానకర్త, వాణిజ్య విభాగ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ (Rajesh Agarwal) గత వారంలో అమెరికా (America) లో పర్యటించి, అమెరికా సంధానకర్తలతో ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొలి దశకు ముందే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా విధించిన 26శాతం ప్రతీకార సుంకం (Tariff) నుంచి మనదేశం పూర్తి మినహాయింపునున కోరుతోంది.