ఇంటర్కాంటినెంటల్ శుభవార్త.. మరో 300 మందిని
అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ (ఐసీఈ) హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. డేటా, టెక్నాలజీ, మార్కెట్ మౌలిక సదుపాయాలను అందిస్తున్న ఐసీఈ 2019లో హైదరాబాద్లో 500 మంది నిపుణులు, ఉద్యోగులతో గ్లోబల్ క్యాపబుల్ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంలో 900 మంది పని చేస్తున్నారని ఐసీఈ ఇండియా అధిపతి సచ్పతి తెలిపారు. భారత్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా 2022 చివరి నాటికి హైదరాబాద్ కేంద్రంలో మరో 300 మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.






