టెక్నాలజీ ప్రపంచంలో మరో మెగా డీల్

టెక్నాలజీ ప్రపంచంలో మరో మెగా డీల్ కుదిరే అవకాశం కనిపిస్తోంది. అమెరికాకు చెందిన రెండు అంతర్జాతీయ చిప్ తయారీ దిగ్గజాలు క్వాల్‌కామ్, ఇంటెల్ ఒక్కటయ్యే చాన్స్ ఉంది. ఇంటెల్‌ను కొనుగోలు చేసేందుకు క్వాల్‌కామ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం క్వాల్‌కామ్ యాజమాన్యం ఇప్పటికే ఇంటెల్‌ను సప్రందించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఇరువర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా ఎన్‌విడియా నుంచి పోటీ పెరగడంతో ఇంటెల్ ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ ఏడాదిలో ఇంటెల్ షేరు 60 శాతం క్షీణింంచింది. ఈ మధ్య కంపెనీ 160 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. ఆర్థిక కష్టాల నేపథ్యంలో వ్యయాలు తగ్గించుకునేందుకు 10,000 మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉంది.