అమెరికా కంపెనీ ఇన్ఫోవిజన్ శుభవార్త.. మరో 2,000 మందిని
డిజిటల్ సేవలు, ఉత్పత్తుల అమెరికా కంపనీ ఇన్ఫోవిజన్ ఇంక్ 2023 కల్లా భారత్లో మరో 2,000 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లను నియమించుకునే యోచనలోఉంది. 2021-22లో కంపెనీ ఆకర్షణీయ పనితీరును కనబర్చిన నేపథ్యంలో, భారత్లో నూతన నియామకాల నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇన్ఫో విజన్ తెలిపింది. డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశం కూడా దీని వెనక ఉంది. ప్రస్తుతం భారత్లో ఐదు నగరాలు హైదరాబాద్, పుణె, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లలో ఇన్ఫోవిజన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ రంగాల్లో డిజిటలీకరణ ఊహించిన దాని కంటే వేగంగా సాగుతోంది. డిజిటల్ రంగంలో మా పెట్టుడులు మరింత మంది ఖాతాదార్లనను ఆకర్షించేందుకు దోహద పడతాయని ఇన్ఫోవిజన్ ప్రెసిడెంట్ సీన్ యలమంచి తెలిపారు.






