ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం చొప్పున పనితీరు ఆధారిత బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ బోనస్‌ను ఇచ్చేందుకు నిర్ణయించింది. నవంబర్ నెల వేతనంతో పాటు ఈ బోనస్‌ను చెల్లించనుంది. సంబంధిత త్రైమాసికంలో ఉద్యోగి పనితీరు, సహకారం ఆధారంగా ఈ బోనస్ చెల్లింపులు చేయనుంది.బోనస్ చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపించింది. క్యూ2లో మెరుగైన వృద్ధిని నమోదు చేశామని, అందులో ఉద్యోగుల సహాయ సహకారాలు మరువలేనివని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇదే నిబద్ధతను ఉద్యోగులు మున్ముందూ కొనసాగించాలని ఆకాంక్షించింది. ఇన్ఫోసిస్ నిర్ణయం ద్వారా డెలివరీ, సేల్స్ యూనిట్‌లో పనిచేసే మిడ్, జూనియర్ లెవల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందనున్నారు.