2022లో ఎంపిక చేసిన వారికి… ఇన్ఫోసిస్

రెండేళ్ల క్రితం (2022)లో కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసిన ఇంజినీరింగ్ పట్టభద్రులకు నియామకాలు ఇవ్వడాన్ని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రారంభించింది. ఇప్పటికే పలువురికి జాయినింగ్ తేదీలు, ఆఫర్‌కు సంబంధించిన సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైన 1000 మందికి ఇప్పటికే ఆఫర్ లెటర్‌లను కంపెనీ జారీ చేసిందని ఐటీ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నైట్స్) వెల్లడించింది. సెప్టెంబరు చివర్లో లేదా అక్టోబరులో ఈ నియామకాలు ఉంటాయని సమాచారం. ఆఫర్ లెటర్‌లు పొందిన వారికి ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవల భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.