Infosys: ఇన్ఫోసిస్ కు భారీ ఊరట

అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) కు భారీ ఊరట లభించింది. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసు (GST Notice )కు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ నుంచి క్లీన్ చిట్ వచ్చింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్ (Regulatory filing) లో వెల్లడిరచింది. 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ప్రీ-షో కాజ్ నోటీసు ప్రొసీడిరగ్స్‌ను మూసివేస్తున్నట్లు డీజీజీఐ (DGGI) నుంచి తమకు సమాచారం అందినట్లు పేర్కొంది.
2017 నుంచి 2022 మధ్య ఇన్ఫోసిస్ విదేశీ శాఖల్లో జరిగిన వ్యయాలకు సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసు 2024 జులైలో ఇన్ఫోసిస్ అందుకుంది. ఈ ప్రీ-షోకాజ్ నోటీసును కర్ణాటక (Karnataka) రాష్ట్ర జీఎస్‌టీ అధికారులు జారీ చేశారు. విదేశీ శాఖల నుంచి దిగుమతి చేసుకున్న సేవలపై రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ఈ నోటీసు పంపారు. ఈ మొత్తం 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 85 శాతానికి సమానం. డీజీజీఐ జారీ చేసిన నోటీసులపై ఇన్ఫోసిస్ అప్పట్లోనే స్పందించిది. గతంలో తమపై అన్ని జీఎస్‌టీ బాకీలను చెల్లించామని, కేంద్ర, రాష్ట్ర నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఈ నోటీసుకు సంబంధించి ప్రొసీడిరగ్స్‌ను మూసివేసినట్లు డీజీజీఐ వెల్లడిరచడంతో ఆ మేర ఇన్ఫోసిస్‌కు ఊరట లభించింది.