Infosys: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో .. వరుసగా ఇది నాలుగోసారి

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)లో ట్రైనీల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. తుది ఇంటర్నల్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో విఫలమైన కారణంగా మరో 195 మందిని ఆ సంస్థ పక్కన పెట్టింది. ఈ ఏడాది ట్రైనీలను తొలగింపు చేపట్టడం వరుసగా ఇది నాలుగోసారి. పరీక్షలో ఫెయిల్ అయిన ట్రైనీలకు ఇ-మెయిల్ (Email )ద్వారా ఇన్ఫోసిస్ సమాచారం ఇచ్చింది. తొలగించిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఎన్‌ఐఐటీ (NIIT) , అప్‌గ్రాడ్ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 800 మందిని ట్రైనీల (Trainees)ను ఇన్ఫోసిస్ తొలగించింది. అందులో 250 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. మరో 150 మంది ఇన్ఫోసిస్ అందిస్తున్న ఔట్ ప్లేస్‌మెంట్ (Outplacement) సేవల కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిసింది. ఇన్ఫోసిస్ తొలుత ఫిబ్రవరి నెలలో 300 మంది ట్రైనీలను తొలగించింది. మార్చిలో 30-35 మందిని, ఏప్రిల్‌లో 240 మందిని తొలగించింది. తాజాగా ఇది నాలుగోసారి.