సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా రకేశ్ గంగ్వాల్

అమెరికాలోని ప్రధాన విమానయాన సంస్థల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా, ఇండిగో సహ వ్యవస్థాపకులు రాకేశ్ గంగ్వాల్ నియమితులయ్యారు. ఇటీవల సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 108 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.900 కోట్ల) పెట్టుబడులను రాకేశ్ పెట్టారు. ఈ ఏడాది జులైలోనే ఆయన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ బోర్డులో చేరారు. మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి, ఆ విమానయాన సంస్థ ఆర్థిక పని తీరును మెరుగుపర్చే లక్ష్యం రాకేశ్ ముందు ఉంది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లెన్స్‌లో అతి పెద్ద వాటాదారుగా ఉన్న ఎల్లియోట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌తో సెటిల్‌మెంట్ జరిగిన వారం తర్వాత గంగ్వాల్ నియామకం జరిగింది. కొత్తగా ఏర్పాటైన బోర్డు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్, సీఈఓ, వైస్ చైర్మన్ బాబ్ జోర్డాన్‌తో కలిసి పని చేసి, సంస్థ ఆర్థిక పని తీరును మెరుగుపర్చాలనుకుంటున్నామని గంగ్వాల్ వెల్లడించారు.