భారత్ కీలక పాత్ర పోషిస్తుంది.. ఐఎంఎఫ్ ఎండీ జార్జీవా
జీ 20 దేశాలకు తదుపరి అధ్యక్షత వహించనున్న భారత్ అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జీవా అన్నారు. ఇందుకోసం అన్ని దేశాలతోనూ భాగస్వామ్యానికి తులపులు తెరిచే ఉంటే,.. అందరినీ కలుపుకునిపోయే సహజ సిద్ధ స్వభావం కలిగిన భారత్ ప్రపంచ దేశాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐఎంఎఫ్ ఫైనాన్స్ కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న నదియా కాల్వినోతో కలిసి మీడియా సమావేశంలో జార్జీవా మాట్లాడారు. కోటాలపై 16 సాధారణ సమీక్ష అనే టాస్క్ భారత్ ముందు ఉంది. ఇది విజయంతంగా పూర్తి కావాలని సమావేశంలో ప్రతి ఒక్కరూ కోరారు. భారత్ జీ 20 నాయకత్వంలో ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నదియాకు సాయపడుతుందని నమ్ముతున్నాను అని జార్జీవా పేర్కొన్నారు.






