RBI Governor: మా ఆర్థిక వ్యవస్థ భేష్ .. పెట్టుబడులతో రండీ :ఆర్‌బీఐ గవర్నర్

కొన్ని సమస్యలున్నా, భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌కు ఢోకా లేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ (India)లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా పారిశ్రామిక (American industrial)వర్గాలను కోరారు. సిఐఐ- భారత అమెరికా వ్యూహత్మక భాగస్వామ్య వేదిక ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ అంతర్జాతీయ ఫైనాన్సియల్ మార్కెట్లలో ఆటుపోట్లు, అనిశ్చితి ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలో మరే దేశ జీడీపీ(GDP )ఈ స్థాయిలో పెరిగే అవకాశం లేదని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. దీర్ఘకాలిక లాభాలు, అవకాశాలు కోరుకునే పారిశ్రామికవేత్తలకు భారత్ చక్కటి మార్కెట్ అని స్పష్టం చేశారు.