అమెరికాలో భారతీయులే టాప్
అమెరికాలో యూనీకార్న్ స్థాయికి చేరిన స్టార్టప్ సంస్థల్లో 55శాతం విదేశాల నుంచి వలస వచ్చిన వారు స్థాపించినవేనని తాజాగా తేలింది. బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన అంకుర సంస్థలను యూనీకార్న్ అని పిలుస్తారన్న విషయం విదితమే. అగ్ర రాజ్యంలో 582 యూనీకార్న్ కంపెనీల్లో 319 సంస్థల వ్యవస్థాపకుల్లో కనీసం ఒక్కరు ఇతర దేశాలకు చెందిన వారేనని వెల్లడైంది. వాటిలో అత్యధికం భారత సంతతి వారు (ఎన్ఆర్ఐలు) స్థాపించినవే. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ సర్వే ప్రకారం, 66 యూనీకార్న్ కంపెనీలను భారత మూలాలు ఉన్న వారే స్థాపించడంతో భారత్‌లో టాప్‌లో నిలిచింది.
ఇక ఈ జాబితాలో భారత్ తరావతి స్థానం ఇజ్రాయెల్‌కు దక్కింది. అగ్ర రాజ్యంలోని 54 యూనీకార్న్ సంస్థలకు ఇజ్రాయెల్‌కు చంబఎదిన వారు వ్యవస్థాపకులుగా ఉన్నారు. అంతే కాకుండా 133 యూనీకార్న్ సంస్థలో కీలకమైన సీఈవో, సీటీఓ, వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక నాయకత్వ స్థానాల్లో ఉన్నది వలసదారులేనిని ఈ సర్వే తేల్చింది. వలసదారుల నేతృత్వంలోని ఒక్కో కంపెనీ 859 మందికి ఉద్యోగాలు కల్పించిందట. ఇక అమెరికాలో రెండు, అంత కంటే ఎక్కువ యూనీకార్న్ సంస్థలను స్థాపించిన పది మంది వలసదారుల్లో దాదాపు నలుగురు భారత మూలాలు ఉన్న వారే. మోహిత్ అరుణ్, అశుతోష్ గార్గ్, అజిత్ సింగ్, జ్యోతి బస్సల్ తలా రెండు సంస్థలు ఏర్పాటు చేశారు.






