Ambani, Adani: అంబానీ, అదానీలకు షాక్… ఆ క్లబ్ నుంచి ఔట్

దేశంలోనే అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani), గౌతం అదానీ (Gautam Adani) ల సంపద పరుగుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్‌లో 24,310 కోట్ల డాలర్లుగా ( సుమారు రూ.20,63,675 కోట్లు) ఉన్న వీరిరువురి సంపద ఈ నెల 13వ తేదీ నాటికి 17,880 కోట్ల డాలర్లకు (సుమారు రూ.15,17,833 కోట్లు) పడిపోయింది. దీంతో వీరిద్దరికి ఈ సంవత్సరం బ్లూమ్ బర్గ్ (Bloomberg) 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటు దొరకలేదు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ నెల 13వ తేదీ మధ్య వీరిద్దరి సంపద రూ.5.45 లక్షల కోట్లు ఆవిరైపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద 12,800 కోట్ల డాలర్ల నుంచి 8,210 కోట్ల డాలర్లకు ( సుమారు రూ.6.96 లక్షల కోట్లు) పడిపోయింది. ఆర్‌ఐఎల్ ఎనర్జీ, రిటైల్ వ్యాపారాల వృద్ధిరేటు తగ్గడం, అప్పులు పెరిగి పోవడం అంబానీ ఆస్తులను దెబ్బతీసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ రాజకీయనేతలు, అధికారులకు లంచాలు మేపిందన్న ఆరోపణలతో ఆమెరికాలో గౌతం అదానీపై కేసులు నమోదు కావడం ఆయన ఆస్తులు క్షీణించడానికి కారణమని తెలిపింది.