టెస్లాకు శ్రీలా వెంకటరత్నం గుడ్ బై

ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం గుడ్‌బై చెప్పారు. 2013 నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె, సుదీర్ఘ విరామం తర్వాత కంపెనీని వీడారు. కుటుంబంతో సమయం గడపడానికి, స్నేహితులతో సరదగా గడపడానికి తన సమయాన్ని కేటాయించడం కోసమే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. టెస్లాలో శ్రీలా వెంకటరత్నం 2013లో చేరారు. గత 11 ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆపరేషన్ హోదాలో తొలుత విధుల్లో చేరిన ఆమె, తర్వాత సీనియర్ డైరెక్టర్‌గా హోదా పొందారు. 2019 నుంచి 2024 వరకు కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్లాకు రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. తాను కంపెనీలో చేరిన తర్వాతే టెస్లా 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించడం సంతోషం కలిగించే విషయమని పేర్కొన్నారు. కొంతకాలం పాటు విరామం తర్వాతే కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తానని పేర్కొన్నారు.