రష్యాను రిక్వెస్ట్ చేసిన భారత్… ఎందుకంటే
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్కు ముడి చమురును చౌకగా అందుతున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి జరుపుతున్న చమురు దిగుమతుల్లో కాస్త మార్పులు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు రష్యా ఆఫర్ చేసిన ధరకు కాకుండా చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు భారత్ అమ్మాలని రష్యాను కోరింది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో పలు దేశాల ఆంక్షల రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఒక బ్యారెల్ ధర సుమారు 108 డాలర్లు ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వ, ప్రైవేట్ అయిల్ సంస్థలు రష్యా రాయితీ ప్రకటించడంతో 40 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును కొనుగోలు చేశాయి. 2021లో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసిన దాని కంటే ఇది 20 శాతం అదనమని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు చమురును అమ్మాలని రష్యాను భారత్ కోరుతోంది. కాగా ఈ ప్రతిపాదనకు రష్యా నుంచి ఎలా స్పందన రాబోతోందో చూడాలి మరి.






