అమెరికా కంపెనీకి భారత్ జరిమానా

స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే1ఏలకు అవసరమైన ఎఫ్404-ఐఎన్20 ఇంజన్ల సరఫరాలో రెండేళ్లు జాప్యం చేసిన అమెరికా సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ (జీవో) ఏరోస్పేస్‌కు భారత్ జరిమానాలు విధించినట్లు తెలిసింది. హాల్, జీఈ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇంజన్ల డెలివరీ 2023 మార్చిలో ప్రారంభం కావాలసి ఉంది. అది సాధ్యం కాకపోవడంతో 2024 మార్చి నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని జీఈ తెలిపింది. అయినా ఇంజన్లు ఇంతవరకు భారత్‌కు చేరుకోలేదు.
ఇటీవల అవమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఇంజన్ల డెలివరీ జాప్యం అంశాన్ని ప్రస్తావించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం సరైన సమయానికి డెలివరీ అందించలేకపోయిన జీఈపై భారత్ జరిమానాలు విధించినట్టు తెలిసింది. దీంతో 2050 మార్చి లేదా ఏప్రిల్ నాటికల్లా ఇంజన్ల డెలివరీలు ప్రారంభిస్తామని జీఈ హామీ ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎంత జరిమానాన విధించారన్న విషయం వెల్లడిరచ లేదు కానీ, ఒకటి కంటే ఎక్కువసార్లే పెనాల్టీ విధించినట్టు పేర్కొన్నాయి.