రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల వల్లే…
భారత ఆర్థిక వృద్ధి 2022లో 4.6 శాతానికి పరిమితం కావొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది గతంలో అంచనా వేసిన 6.7 శాతం కంటే 2.1 శాతం తక్కువ కావడం గమనార్హం. రష్యా`ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం వల్లే ఇది తగ్గొచ్చని పేర్కొంది. ఇంధన ధరలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన విధానాలు, ఆర్థిక అస్థిరత వంటివి వృద్ధిపై ప్రభావం చూపుతాయని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) పేరుతో రూపొందించిన ఈ నివేదికలో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం 3.6 శాతం నుంచి 2.6 శాతానికి కుదించింది.






