టెస్లాకు భారత్‌లో మరోసారి షాక్!
అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్‌లో మరోసారి షాక్ తగిలింది. విద్యుత్ కార్లను దిగుమతి చేసుకోవడానికి పన్నులను తగ్గించాలని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించినట్టు సమాచారం. ఇప్పటికే పాక్షికంగా తయారు చేసిన వాహనాలను దిగుమతి చేసుకోవడానికి, తక్కువ పన్నులతో వాటిని స్థానికంగా అసెంబ్లింగ్ చేయడానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సుంకాలను సవరించాల్సిన అవసరం ఉందా అన్న అంశాన్ని మేము పరిశీలించాం. ఇప్పటికే దేశీయంగా కొంత ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్ వ్యవస్థతో కొన్ని పెట్టుబడులు సైతం వచ్చాయి. కాబట్టి ఇది అడ్డంకి కాదు అని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్ వివేక్ జోహ్రీ పేర్కొన్నారు.






