ప్రవాసుల నిధుల ప్రవాహంలో… భారత్ దే అగ్రస్థానం

ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. 2023లో మనదేశానికి 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10.37 లక్షల కోట్ల)ను ప్రవాసులు పంపించారని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి, దిర్హామ్‌ను ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు యూఏఈతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం లాంటి అంశాలు ఇందుకు దోహదం చేశాయని నివేదిక తెలిపింది. అయితే భారత్‌కు ప్రవాసులు పంపించిన నిధులు పెరగడం మాత్రం 2022తో పోలిస్తే, సగానికి తగ్గిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. భారత్ తర్వాత ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో మెక్సికో రెండో స్థానంలో (67 బిలియన్ డాలర్లు) ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (50 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), ఈజిప్ట్ (24 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. భారత్‌కు అత్యధికంగా యూఏఈ నుంచి ప్రవాసులు నిధులు పంపిస్తున్నారు.