అమెరికా, చైనా తర్వాత.. భారత్‌ది మూడోస్థానం
భారత్‌లో బిలియనీర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ పోతున్నది. 2021లో దేశంలో 215 మంది బిలియనీర్లు ఉండగా కొత్తగా 58 మంది ఈ జాబితాలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం అమెరికా టాప్‌లో ఉండగా, చైనా రెండో స్థానంలో కొనసాగుతున్నది. భారత్ సంతతికి చెందిన బిలియనీర్లు మొత్తం 249కు చేరుకుంది. అయితే నగరాల వారీగా చూసుకుంటే ముంబై టాప్‌లో ఉంది. ఒక ఆర్థిక రాజధాని నుంచే 72 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో 51 మంది బిలియనీర్లతో ఢిల్లీ రెండో స్థానంలో, బెంగళూరు 28 మందితో మూడో స్థానంలో నిలిచాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 3381 మంది బిలియనీర్లు ఉండగా, అందులో 153 మంది కొత్తగా వచ్చినవారే కావడం గమనార్హం.






