గుడ్ న్యూస్ ఇక వారానికి నాలుగు రోజులే!
ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్ ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్ స్కీమ్‌లో పాల్గొన్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్ జరిగింది. ఇందులో మొత్తం 3,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారానికి ఐదు రోజులు చేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో నాలుగు రోజుల పనిచేసినా అంతే మొత్తాన్ని చెల్లించారు. చిన్న పెద్ద కంపెనీలు అనేతేడా లేకుండా అన్ని సంస్థలు ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ఈ విధానానే తాము కొనసాగిస్తామని తెలిపారు. 4 శాతం సంస్థలు కాస్త సందిగ్దత వ్యక్తం చేయగా, మరో 4 శాతం కంపెనీలు తాము పాత పద్ధతినే (ఐదు రోజుల పనిదినాలు) కొనసాగిస్తామని స్పష్టం చేశారు.






