అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన ఐఎమ్ఎఫ్

ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) పెంచింది. అమెరికాలో బలమైన వృద్ధికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం వృద్ధిల మందగమనం ఇందుకు దోహదం చేయొచ్చని తాజా భవిష్యత్ అంచనాల్లో ఐఎమ్‌ఎఫ్ పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థికం 3.1 శాతం వృద్ధి నమోదు చేయగలదని పేర్కొంది. అక్టోబరు అంచనా అయిన 2.9 శాతం కంటే ఇది అధికం. ప్రపంచవ్యాప్తగా 2023లో 6 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, 2024లో 5.8 శాతానికి, వచ్చే ఏడాది 4.4 శాతానికి పరిమితం కాగలదని అంచనా వేసింది. అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది ద్రవ్యోల్బణం 2. 6 శాతానికి, వచ్చే ఏడాది 2 శాతానికి తగ్గొచ్చని చెబుతోంది. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి 6.5 శాతం నమోదు కావొచ్చని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది.