IBM: ఐబీఎంలో భారీగా ఉద్యోగాల కోత

భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న అమెరికన్ టెక్ దిగ్గజాల్లో ఐబీఎం (IBM) కూడా చేరింది. ఈ సంస్థ 8,000 ఉద్యోగుల (Employees)ను తొలగించినట్లు తెలిసింది. అందులో మెజారిటీ సిబ్బంది మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగానికి చెందినవారే. ఐబీఎం ఈ మధ్యనే 200 హెచ్‌ఆర్ (HR) ఉద్యోగాలను ఏఐ ఏజెంట్ల (AI agents ) తో భర్తీ చేసింది. కొద్ది రోజులకే ఈ విభాగంలో భారీగా తీసివేతలకు పూనుకోవడం గమనార్హం.