ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ డైరెక్టర్ల బోర్డులోకి… అరవింద్ కృష్ణ
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ డైరెక్టర్ల బోర్డులోకి ఐబీఎం చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) అరవింద్ కృష్ణ (60) ఎన్నికయ్యారు. క్లాస్ బి డైరెక్టర్‌గా ఆయన బోర్డుకి ఎన్నికయ్యారని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఐబీఎం రీసెర్చ్‌కు అధిపతిగా వ్యవహరించారు. ఐబీఎం సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ జనరల్ మేనేజర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. అరవింద్ కాన్పూర్ ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. గతంలో క్లౌడ్ కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్‌కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 2023 డిసెంబరు 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది.






