హురున్ యువ పారిశ్రామికవేత్తల జాబితాలో… ఇషా, ఆకాశ్ అంబానీకి చోటు

దేశంలో 35 ఏళ్ల లోపు వయసున్న అత్యుత్తమ యువ పారిశ్రామికవేత్తల్లో భారత కుబేరుడు, ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీకి చోటు దక్కింది. హురున్ ఇండియా ఈ ఏడాదికి గాను మొత్తం 150 మంది వయు పారిశ్రామికవేత్తల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. హురున్ ఈ లిస్ట్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి ఇందులో స్థానం లభించింది. నగరాల విషయానికొస్తే 29 మంది యువ పారిశ్రామికవేత్తలతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ముంబై (26 మంది), ఢల్లీి ( 21 మంది), హైదరాబాద్ (9 మంది) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో ని 123 మంది తొలితరం పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. మిగతవారు తమ కుటుంబ వ్యాపారాలను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని హురున్ పేర్కొంది.