Highland: హైదరాబాద్‌లో హైల్యాండ్ కార్యాలయం

కంటెంట్ ఇన్నోవేషన్ క్లౌడ్ సంస్థ హైల్యాండ్ (Highland) తాజాగా హైదరాబాద్‌లో తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ (Jennifer Larson) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్స్, సర్వీసెస్ స్పెషలిస్ట్‌లు, కస్టమర్ సక్సెస్ కోఆర్డినేటర్లు, క్లౌడ్ టెక్నికల్ సపోర్ట్ నిపుణులను నియమించుకోనున్నట్లు సంస్థ సీటీవో టిమ్ మైకింటైర్ (Tim McIntyre) తెలిపారు. కార్యకలాపాలను క్రమబద్ధీకరించు కోవడానికి, ఉత్పాదకత పెంచుకోవడానికి కస్టమర్లకు అవసరమైన అధునాతన సాధనాలను అందించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. కంపెనీకి ఇప్పటికే కోల్‌కతా (Kolkata)లో ఒక కార్యాలయం ఉంది.