GST : జీఎస్టీ వసూళ్లలో ఆ రికార్డు బద్దలైంది : కేంద్రం

వస్తు, సేవల పన్ను ( జీఎస్టీ)( GST) వసూళ్లలో సరికొత్త రికార్డు (Record) నమోదైంది. ఏప్రిల్ (April) నెలలో రూ.2.37 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం (Central Government) వెల్లడిరచింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఈ మొత్తంగా రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు నమోదైన నెలగా 2025 ఏప్రిల్ నిలిచింది.
గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 12.6 శాతం మేర పెరగడం విశేషం. అంతకుముందు నెలలో ( మార్చి) జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.9 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 10.7 శాతం మేర పెరిగింది. దిగుమతైన వస్తువులపై వేసే జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 20.8 శాతం మేర పెరిగి రూ.46,913 కోట్లుకు పెరిగింది. రూ.27,341 కోట్ల రిఫండ్లు జారీ అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.