టెక్నాలజిక్స్ గ్లోబల్‌తో గ్రీన్ రోబోటిక్స్ భాగస్వామ్యం
అమెరికా మార్కెట్లో అటానమస్ ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్లను ప్రవేశపెట్టడానికి టెక్సాస్‌కు చెందిన టెక్నోలాజిక్స్ గ్లోబర్తో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ రోబోటిక్స్ చేతులు కలిపింది. గ్రీన్ రోబోటిక్స్ అందించే ఆటానమస్ టెక్నాలజీ కంపెనీల ఆదాయాన్ని పెంచడమే కాక నిర్వహణ వ్యయాలను తగ్గిస్తాయని గ్రీన్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ కిరణ్ పీ తెలిపారు. టెక్నాస్ కంపెనీతో ఏడాది కాలంగా చర్చలు జరిపిన అనంతరం చేతులు కలిపామన్నారు. కంపెనీకి చెందిన గ్రీన్ ఓఎస్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీలు ఐదో తరం పారిశ్రామిక విప్లవంలోకి అడుగు పెట్టగలవన్నారు.






