త్వరలోనే అమెరికామార్కెట్ లో గ్రాన్యూల్స్ ఔషధం
రక్తంలో పోటాషియం స్థాయి తక్కువగా ఉండే వారికి, చికిత్సలో ఉపయోగించే పొటాషియం క్లోరైడ్‌ను అమెరికాలో విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఔషధ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాకు యూఎస్ఎఫ్డీఏ అనుమతించింది. పొటాషియం క్లోరైడ్‌కు సంబంధించిన అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ (ఏఎన్‌డీఏ)కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చిందని కంపనీ తెలిపింది. త్వరలోనే అమెరికా మార్కెట్లో ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందని గ్రాన్యూల్స్ విదేశీ అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ ఫార్మాసూటికల్స్ ఇంక్ (జీపీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియాంక చిగురుపాటి పేర్కొన్నారు. యూఎస్ఎఫ్డీఏ నుంచి మొత్తం 49 ఏఎన్‌డీఏ అనుమతులు పొందినట్లు తెలిపారు.






