గ్రాన్యూల్స్ ఔషధానికి అమెరికాలో అనుమతి
గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ సంస్థ, గ్రాన్యూల్స్ ఫార్మా స్యూటికల్స్ ఇంక్, సిల్డెనాఫిల్ ఓరల్ సస్పెన్షన్ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ( యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ మందు వయాట్రిస్ స్పెషాలిటీ ఎల్ఎల్సీ అనే సంస్థకు చెందిన రెవాటియో బ్రాండుకు జనరిక్ ఔషధం. సిల్డెనాఫిల్ ఓరల్ సస్పెన్షన్ను పల్మనరీ ఆర్టెరియల్ హైపర్టెన్షన్ (పీఏహెచ్) చికిత్సలో వినియోగిస్తున్నారు. ఈ మందు అమెరికాలో గత ఏడాది కాలంలో 43 మిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదు చేసింది. ఈ ఔషధంతో కలిసి తమకు అమెరికాలో 63 ఏఎన్డీఏ అనుమతులు ఉన్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా తెలిపింది.






