Whatsapp: వాట్సప్ కు కేంద్రం గుడ్ న్యూస్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (whatsapp) అందిస్తున్న పేమెంట్ సేవలపై ఉన్న ఆంక్షల్ని కేంద్రం సడలించింది. దీంతో భారత్ (India) లో ఉన్న వాట్సప్ యూజర్లందరికీ త్వరలోనే ఈ చెల్లింపుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కేవలం 10 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఒకప్పుడు మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన వాట్సప్ ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చి ఎక్కువ మంది యూజర్లకు చేరువైంది. భారత్‌లో ప్రస్తుతం ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను 50 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వాట్సప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై (Payment Services) కేంద్రం తొలుత పరిమితులు విధించింది. 2020లో పేమెంట్ సేవల్ని కేవలం 4 కోట్ల మందికి మాత్రమే వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించింది. 2022లో ఆ సంఖ్యను 10 కోట్లకు పెంచింది. తాజాగా దీనిపై ఉన్న పరిమితుల్ని తీసివేసినట్లు తెలుస్తోంది.