AI: ఏఐతో ఉద్యోగాల కోత ఉండదు : హెచ్‌డీఎఫ్‌సీ సీఈఓ

కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వల్ల తమ బ్యాంకులో ఉద్యోగుల కోత ఉండదని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సీఈఓ, ఎండీ శశిధర్ జగదీశన్ (Shashidhar Jagadeesan) ప్రకటించారు. అయితే బ్యాకెండ్‌లో ఉన్నవారు సాంకేతికత పైపు రావడానికి ఇది మంచి అవకాశాన్ని అందిస్తుందని వివరించారు. జెనరేటివ్ ఏఐ (AI)తో పాటు మరికొన్ని సాంకేతిక విభాగాల్లో బ్యాంక్ నుంచి పరిశోధనలు జరుగుతున్నాయని, దీని వల్ల ప్రయోజనాలు వచ్చే 18-24 నెలల్లో కనిపిస్తాయని శశిధర్ వెల్లడిరచారు. గత 6 నెలల్లో కొత్తగా నియమించుకున్న 5,000 మందితో కలిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు చివరికి బ్యాంకులో మొత్తం 2.20 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. కొత్త సాంకేతికతల వల్ల ఉద్యోగులు పనిచేసే విధానాలు, స్థానాలు మారతాయి కానీ, వారిని తొలగించేది ఉండదని స్పష్టం చేశారు. ఉద్యోగుల వలసలు కొనసాగుతాయని పేర్కొన్నారు.